
యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి శుక్రవారం, కొనుగోలు కేంద్రాన్ని డిఆర్డిఓ కృష్ణన్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రైతులు కేంద్రంలోనే ధాన్యం అమ్ముకోవాలని కనీస మద్దతు ధర అందరికీ అందాలనే ఉద్దేశంతో గ్రామంలోనే ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేశాము అని, తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని మోసపోవద్దని, రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. అలాగే వ్యవసాయ అధికారికి ఎఫ్ ఏ క్యూ పాటించే విధంగా రైతులకు తెలియజేయాలని కల్లాల్లోనే ఆరబెట్టుకొని తాలూ చెత్త మట్టి వంటి పదార్థాలు లేకుండా తూర్పాలు పట్టి ఉన్న ధాన్యానికి టోకెన్ ఇవ్వవలసిందిగా సూచించారు. కేంద్రం వారు వచ్చిన కుప్పలను వచ్చినట్లే వెంటనే వరుస క్రమంలో రైతుల పేర్లు నమోదు చేసుకుని అదే క్రమంలో వ్యవసాయ అధికారి ద్వారా పరీక్ష చేయించి సీరియల్ తప్పకుండా కొనుగోలు చేయాలని తెలియజేశారు.