నవతెలంగాణ- తిరుమలగిరి
నల్గొండ, సూర్యాపేట చేనేత & జౌళీ శాఖ సహాయ సంచాలకులు ద్వారక్ చేస్తున్న సాధారణ తనిఖీలో భాగంగా గురువారం తిరుమలగిరి మండలం చేనేత సహకార సంఘాన్ని పరిశీలించారు. సంఘం యొక్క సమస్యలు,ఆర్ధిక పరిస్థితులను సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రభుత్వం అందించే పథకాలు చేనేత చేయూత,చేనేత మిత్ర,చేనేత భీమా అందరికీ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సూర్యాపేట ఫీల్డ్ ఆఫీసర్ ఏ డి ఓ గోపాల్ ఉన్నారు.ఈ సందర్భంగా చేనేత కార్మికులు వారిని సాదరముగా ఆహ్వానించి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమం లో చేనేత సంఘం సమన్వయ కర్త వంగరి బ్రహ్మం నేత,సంఘ నాయకులు మద్దూరి వెంకటయ్య,వంగరి సోమ కృష్ణ,చిలుకమారి యాదగిరి,మద్దూరి కృష్ణమూర్తి, వంగరి సోమయ్య, వీరబతిని మల్లయ్య, మద్దూరి ఉమేష్, మద్దూరి శేఖర్, ఎనగందుల రవి, మద్దూరి వెంకన్న, అమృతం రాజు, వంగరి సత్యనారాయణ, మంచే అంబాధస్, వంగరి కోటయ్య, చిలుకమారి జయ రాములు, అక్కల ఉప్పలయ్య,వంగరి రమేష్,రాపోలు కొండయ్య,వీరబతిని మురళి ,వంగరి ఉపేందర్,కోట రాములు,కోట సిద్ది రాములు తదితరులు పాల్గొన్నారు.