– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా శుక్రవారం ప్రారంభమైన కుటుంబాలకు గుర్తింపు సర్వేను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, తహసిల్దార్ ఆంజనేయులు పరిశీలించారు. మండలంలోని రాజరాజేశ్వరి నగర్, నాగాపూర్, ఉప్లూర్, కొన సముందర్, అమీర్ నగర్, నర్సాపూర్, చౌట్ పల్లి గ్రామాల్లో కుటుంబాలకు గుర్తింపు సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో సుమారు 12 వేల కుటుంబాలు ఉన్నట్లు తెలిపారు. గ్రామాల్లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) నిర్వహణ కోసం మండలాన్ని 72 బ్లాక్ లుగా గుర్తించి, ఎన్యుమరేటర్లను నియమించినట్లు తెలిపారు. సర్వేను పర్యవేక్షించేందుకు మండలంలో ఆరుగురు సూపర్వైజర్లను కూడా నియమించినట్లు వివరించారు. నేటి నుండి మూడు రోజులపాటు గ్రామాల్లో కుటుంబాల గుర్తింపు కోసం ఎన్యుమరేటర్లు సర్వే నిర్వహిస్తున్నారన్నారు. గుర్తించిన కుటుంబ యజమాని పేరుతో గోడ ప్రతిని అతికించడం జరుగుతుందన్నారు. ఈనెల ఆరవ తేదీ నుండి గుర్తించిన కుటుంబాల వ్యక్తిగత వివరాల నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు తమ ఇండ్లలో అందుబాటులో ఉండి ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్ లకు పూర్తి వివరాలు అందజేసి సహకరించాలని కోరారు.కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శరత్, ఐకెపి ఎపిఎం కుంట గంగాధర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.