నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని బుధవారం రోజు ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు వాడిపోకుండా చూడాలని సంబంధిత అధికారులను ఎంపీవో ఆదేశించారు.