వరి ధాన్యం  కొనుగోలు కేంద్రం పరిశీలన

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని కోనాపూర్ లో సింగల్ విండో ఆధ్వర్యంలో కొనసాగుతున్న వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సాయంత్రం జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ సందర్శించి పరిశీలించారు. వరి కొనుగోలు కేంద్రంను సందర్శించి వరి ధాన్యం యొక్క ఎఫ్ ఏక్యూ పారమీటర్స్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ  సందర్భంగా ఆయన కోరారు. ఆయన వెంట భీంగల్  ఏడిఏ మల్లయ్య, స్థానిక సింగిల్ విండో చైర్మన్ బడాల రమేష్ రెడ్డి, వ్యవసాయ వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయిరాం, విండో కార్యదర్శి నాగరాజు, రైతులు, తదితరులు ఉన్నారు.