
నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాన్ని గురువారం రోజు కామారెడ్డి జిల్లా యువజన క్రీడ అధికారి దామోదర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమ్మర్లో 14 సంవత్సరాల లోపల ఉన్న యువకులందరూ క్రీడలలో పాల్గొనాలని ఆయన అన్నారు ప్రతిరోజు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న నరేష్ రెడ్డితో పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.