నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోప నపల్లి గ్రామంలో భూగర్భ డ్రయినేజీ ఓవర్ ఫ్లో సమస్యను గచ్చిబౌలి డివి జన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి గోపనపల్లి వాసులుతో కలిసి సోమవారం పరిశీలించారు. కొన్ని రోజులుగా భూగర్భ డ్రయినేజీ నీరు రోడ్డుపై ప్రవ హించడంతో స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వెంటనే అక్కడికి వెళ్లి సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. డ్రయి నేజీ శాశ్వత పరిష్కారం కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదే శించారు. నగరంలో కురుస్తున్న వర్షానికి కాలనీలలో రోడ్లు జలమయం కావడంతో రోడ్లపై ఉన్న వరద నీటిని వెంటనే కాలువల్లోకి మళ్లీంచాలని, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులకు కార్పొ రేటర్ సూచించారు. డివిజన్ పరిధిలోని కాలనీలు వరద ముంపునకు గురి కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు సహాయక చర్యలు చేప ట్టడంతో పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, రంగస్వామి, మధు, స్థానిక నేతలు, కార్యకర్తలు, హెచ్ఎండబ్ల్యుఎస్ సూపర్వైజర్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.