– లేకపోతే ఎన్నికలకు కావలసిన డబ్బు, మద్యం, ఇతర రాష్ట్రాల నుండి సరఫరా జరిగే అవకాశాలు
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుదారుల గుండా వెళ్లే వాహనాల పట్ల అడ్డుకట్ట వేయలేక పోతుంది. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది. నోటిఫికేషన్ జారీ అయింది. ఎన్నికల్లో మద్యం డబ్బు సరఫరా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర బార్డర్ ప్రాంతంలో 161 జాతీయ రహదారి మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ సమీపంలో అంతర్రాష్ట్ర చెకింగ్ చెక్పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం డబ్బు అత్యధికంగా పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం మన రాష్ట్ర సరిహద్దు 161 వ జాతీయ రహదారిపై మహారాష్ట్ర బార్డర్ ప్రాంతంలో చెకింగ్ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. హైవే రోడ్డుపైనే తనిఖీలు చేపట్టగా ఇక మన రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దులోని మద్నూర్ మండలం ఇటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో ఉండటం అడ్డుదారుల గుండా పెద్ద పెద్ద లారీలు, కార్లు, జీపులు, టెంపోలు, తుఫాన్లు, త్రీ వీలర్లు టూ విల్లర్లు రాత్రింబవళ్లు అడ్డుదారి అయిన పెద్ద తడగూర్ రోడ్డు గుండా మద్నూర్ మండల కేంద్రం మీదుగా మన రాష్ట్రంలోకి రాత్రింబవళ్లు వందల సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తున్నాయి. మద్నూర్ మండల కేంద్రానికి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూర ప్రాంతంలో మహారాష్ట్ర లోకి వెళ్లే నగరాల అడ్డుదారి వద్ద ప్రత్యేకంగా చెకింగ్ పోస్టు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మహారాష్ట్రకు వెళ్లే నాగరాల అడ్డుదారి అక్రమ వాహనదారులకు అతి ముఖ్యమైనది. ఈ అడ్డుదారి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకట్ట వేయలేక పోతుంది. హైవే రోడ్డుపైనే వాహనాలు తనిఖీలు చేపట్టే వాటిని చూసి డబ్బు మద్యం తరలించే వాహనాలు అడ్డు దారి గుండా తరలించేందుకు ఆస్కారం లేకపోలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల పట్లనే కాకుండా ఎనీ టైం ఈ అడ్డుదారికి చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తే మన రాష్ట్ర ఆదాయానికి ప్రతిరోజు వేలాది రూపాయలు ఆదాయం వచ్చే అవకాశాలు లేకపోలేదనీ, మండల ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది అడ్డుదారుల గుండా మన అంతర్రాష్ట్ర చెక్పోస్టులను తప్పించుకొని వాహనాలు తరలిస్తున్నారు. ఇలా అడ్డుదారుల గుండా తరలి వెళ్లే వాహనాల నుండి వచ్చే పన్ను ఆదాయం పూర్తిగా కోల్పోవలసి వస్తుంది. ఈ అడ్డు దారి మూడు రాష్ట్రాలకు ముఖ్యమైంది ఎంపీ ఎన్నికల్లో మద్యం గాని డబ్బు గాని ఏరులై పారకుండా ఇతర రాష్ట్రాల నుండి మద్యం డబ్బు తరలిరాకుండా ప్రత్యేకంగా అడ్డుదారికి రాష్ట్ర సరిహద్దు వద్ద తనిఖీ చెక్పోస్ట్ ఏర్పాటు ఎంతో ముఖ్యం కాబట్టి ప్రజల అభిప్రాయం మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం అడ్డుదారికి ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.