నవ తెలంగాణ:ఆర్మూర్;- మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఏరియాలో గల మున్సిపల్ 24వ వార్డులో 10 శాతం మున్సిపల్ స్థలంలోంచి సుమారు 100 గజాల జాగను కబ్జా చేసి అర్గుల్ శ్రీను వ్యక్తి అనే వ్యక్తి అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్నాడని బిజెపి ఆర్మూర్ పట్టణ నాయకులతో కలిసి బుధవారం అక్రమ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. మున్సిపల్ పది శాతం స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ దృష్టికి బిజెపి నాయకులు తీసుకెళ్లారు. మున్సిపల్ లో అక్రమ కట్టడాలను ఆపి మున్సిపల్ శాతం స్థలాలను ప్రజల అవసరాల రీత్యా కాపాడాలని బిజెపి నాయకులు కోరారు. మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వారిలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి. నరసింహారెడ్డి, నాయకులు కాందేష్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు.