యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన జిల్లెల్ల ఓదెల యాదవ్ కాటారం మండల అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లుగా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఈనెల 5న నుండి సెప్టెంబర్ 5 వరకు ఆన్లైన్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నవి. ఈ సందర్భంగా ఓదెలు యాదవ్ మాట్లాడుతూ మండల అధ్యక్షులుగా ఆశీర్వదించి గెలిపించినట్లయితే అందరికీ అందుబాటులో ఉంది పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు . ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడే ఈ అధ్యక్ష పోటీల్లో కార్యకర్తలు అందరూ తనకు మద్దతుగా యువకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించాలని, ఆన్లైన్ ద్వారా తనకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో వచ్చేలా చూడాలని కోరారు.