ఎన్నికల నిర్వహణకు ముస్తాబు అయిన తహశీల్ధార్ కార్యాలయం

– సమస్యాత్మక నియోజకవర్గం
– ప్రశాంతంగానే గత మూడు ఎన్నికలు
– సాయంత్రం 4 గంటలు వరకే పోలింగ్
నవతెలంగాణ – అశ్వారావుపేట:
ఎన్నికల కమీషన్ సోమవారం పోలింగ్ సమయం నోటిఫికేషన్ విడుదల చేస్తూ అశ్వారావుపేట నియోజక వర్గాన్ని సమస్యాత్మక నియోజక వర్గంగా గుర్తించి, పోలింగ్ సమయం సైతం ఉదయం 7 గంటలు నుండి సాయంత్రం 4 గంటలు వరకే నిర్ణయించింది. అయితే ఈ నియోజక వర్గంలో ఇప్పటికే మూడు దఫాలు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎలాంటి అసాంఘిక చర్యలు, సమస్యలు తలెత్తకుండా నే ఎన్నికల నిర్వహణా చరిత్రను బట్టి తెలుస్తుంది. అసెంబ్లీ సాదారణ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజక వర్గం ఎన్నికల అధికారులు,సహాయ అధికారులు గా విధులను సమర్ధవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటి సారి గా 2009  లో ఐటిడిఎ నాటి పి.ఒ శరత్, సయ్యద్ ఆస్కర్ రజా, 2014 లో  ఐటిడిఎ పి.ఒ దివ్య, సి.హెచ్ నరేందర్, 2018 లో జె.సి కర్నాటి వెంకటేశ్వర్లు, రాఘవరెడ్డి లు విధులు నిర్వహించారు. 2023 లో ప్రస్తుతం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.రాంబాబు ఎన్నికల అధికారి గా, ఎ.ఇ.ఆర్.ఒ గా తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్ లు ఈ విధులను నిర్వహిస్తున్నారు.