బాధ్యతలు చేపట్టిన ప్రత్యేకాధికారులు..

నవతెలంగాణ – బెజ్జంకి
సర్పంచుల పదవికాలం ముగిసిపోవడంతో మండలంలో అయా గ్రామాలకు నియమాకమైన ప్రత్యేకాధికారులు గురువారం బాధ్యతలు చేపట్టారు.ప్రభుత్వాదేనుసారం మండలంలో అయా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేకాధికారులకు నేడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశ కార్యాలయంలో పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నట్టు ఎంపీడీఓ దమ్మని రాము తెలిపారు.అయా గ్రామాల పంచాయతీ కార్యాలయ బ్యాంక్ లావాదేవిలను ప్రీజీంగ్ చేసి డీజీటల్ కీలను స్వాదీనం చేసుకున్నామని సంబంధిత జిల్లా పరిపాలనాధికారి అధేశానుసారం ప్రత్యేకాధికారులు విధులు నిర్వర్తిస్తారని ఎంపీడీఓ తెలిపారు.అనంతరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ దమ్మని రాము ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టారు.మాజీ సర్పంచ్ ద్యావనపల్లి మంజుల శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
అయా గ్రామాల ప్రత్యేకాధికారులు..బెజ్జంకి,కల్లెపల్లి,తోటపల్లి (దమ్మని రాము,ఎంపీడీఓ), దాచారం,బేగంపేట, రేగులపల్లి(విష్ణు వర్ధన్ ఎంపీఓ), గుండారం,వడ్లూర్,గుగ్గీల్ల(ఎర్రోల్లశ్యామ్,తహసిల్దార్),గాగీల్లపూర్,లక్ష్మీపూర్(సమ్మయ్య,ఏఈ పీఆర్),చీలాపూర్, గూడెం(కిషోర్ కుమార్,ఏఈ ఇరీగేషన్),దేవక్కపల్లి,వీరాపూర్ (సంతోష్ ,ఏఓ వ్యవసాయం),చీలాపూర్ పల్లి,పెరుకబండ (అభిషేక్,ఏఈ మిషన్ భగీరథ ),ముత్తన్నపేట,పోతారం (డీ.రేణుకా,ఏఈ మిషన్ భగీరథ ),తిమ్మాయిపల్లి,బెజ్జంకి క్రాసింగ్ (అంజయ్య,సూపరీండెంట్,ఎంపీడీఓ),తలారివాని పల్లి, నర్సింహుల పల్లి(నాగారాణి,ఐసీడీఎస్ సూపర్ వైజర్)లు ప్రత్యేకాధికారులుగా నియమాకమైయ్యారు.