అధికారులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

– హుస్నాబాద్ ఆర్డివో , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రామ్మూర్తి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్క అధికారి విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్ ఆర్డిఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రామ్మూర్తి అన్నారు.సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని మహిళా జూనియర్ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించే అధికారులకు మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ  పార్లమెంట్ ఎన్నికలలో అధికారులు నిర్వహించే బాధ్యతలను, పోలింగ్ బూత్లలో చేపట్టే విధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ తాహాసిల్దార్ రవీందర్ రెడ్డి , అధికారులు తదితరులు పాల్గొన్నారు