ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి

– కలెక్టర్ నారాయణరెడ్డి 
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ముందుగా ప్రజాకవి కాలోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ప్రజల వద్ద నుండి పీర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా అధికారులకు ప్రజావాణిపై కలెక్టర్  సూచనలు చేస్తూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, ఫిర్యాదులు పెండింగ్లో ఉంచవద్దని అన్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే ఆ విషయాన్ని ఫిర్యాదు దారుకు స్పష్టంగా తెలియజేయాలని, అదేవిధంగా రాష్ట్రస్థాయిలో పరిష్కారం అయ్యేవాటిని రాష్ట్రస్థాయికి పంపించాలని చెప్పారు.ఈవారం ఫిర్యాదులలో వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్,డిఆర్ఓ రాజ్యలక్ష్మి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.