అధికారులు సమన్వయముతో పని చేయాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్

నవతెలంగాణ -పెద్దవూర
వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు సమన్వయం తో పని చేయాలని  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ను మండల కేంద్రం లో పంచాయతీ రాజ్ శాఖఅధికారులు, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు విక్షించారు.వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు  చర్యలు చేపట్టాలని కోరారు.అధికారులే గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా ఉండడంతో బాధ్యత చాలా ఉందని అన్నారు.వచ్చే 3 నెలలు అత్యంత కీలకమైనవని బాధ్యత అంతా పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈ రెండు శాఖలపై ఉందన్నారు. ఏఈలు ప్రతిరోజూ క్షేత్ర స్థాయిలో ఉండాలని, డీఈలు సంబంధిత మండలంలో ఉండాలని ఆమె తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు నిత్యం ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో టచ్ లో ఉండాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలతో అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడీఓ సుధీర్ కుమార్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ దీక్షిత్ కుమార్,కార్యదర్శులు తదితరులు ఉన్నారు.