ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులు

నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు వారిని ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్‌ సి.నారా యణ రెడ్డి ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ బి.పాల్వన్‌కుమార్‌, డిప్యూటీ సీఈవో సుభాషిని, మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, ఎల్‌డీఎం రాంబాబు, ప్రిన్సిపల్‌ మందారిక, జిల్లా ఖజానా కార్యాలయ సిబ్బంది నులు లాల్‌, నిశాంత్‌, శ్రావణి, డీపీఆర్‌ఓ కార్యాలయ సిబ్బంది సతీష్‌, తదితరులు ప్రశంస పత్రాలు అందుకున్నారు. జిల్లా ఖజానా అధికారి వెంకటరమణ అవార్డులు అందుకున్న సిబ్బందిని ప్రశంసించారు.