– అంత ఇంచార్జ్ లే..!
నవతెలంగాణ – చందుర్తి: ఇంచార్జ్ అధికారుల వ్యవస్థలో పనులు పెండింగ్ తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పలు కార్యాలయాల్లో పూర్తి స్థాయి అధికారులు లేక పోవడంతో కాళీలు వెక్కిరిస్తున్నాయి. కార్యాలయాల
ఇంచార్జ్ కార్యాలయాలు ఇవే..!
మండల విద్యావనరుల కేంద్రంలో విద్యాధికారి పోస్ట్ గత ఎనిమిది సంవత్సరాలుగా కాళీగా ఉండగా ఇంచార్జ్ అధికారి శ్రీనివాస్ దీక్షిత్ పని చేస్తున్నాడు, తహశీల్దార్ కార్యాలయంలో యం ఆర్ ఓ శ్రీనివాస్ తన కుమారుడి పెళ్లి ఉండగా సెలవుపై వెళ్ళాడు. సహకార సంఘం సిఈఓ సస్పెండ్ కాడంతో సనుగుల సహకార సంఘం సిఈఓ శ్రీ వర్ధన్ కు బాధ్యతలు ఇచ్చారు. స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనకాంత్ విధుల నుంచి తొలగించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడంతో రుద్రాంగి ఎస్సై అశోక్ కు బాధ్యతలు ఇచ్చారు. మండల పంచాయతీ అధికారిగా రుద్రంగి ఎంపీఓకు ఇంచార్జ్ గా ఉన్నారు. ఎస్సి బాలుర వసతి గృహం ఇంచార్జ్ వార్డెన్ గా రవీంర్ స్వామి ఉన్నారు. పశువైద్యశాలలో కాళీ పోస్ట్ లున్నాయి. దీంతో కాళీ పోస్ట్ లతో కార్యాలయాలు వెక్కిరిస్తున్నాయి.
ఎంపీడీఓ కార్యాలయంలో ఆరు నెలల్లో నలుగురు అధికారులు..!
మండల అభివృద్ధి కార్యాలయంలో ఫిబ్రవరిలో ఎంపీడీఓ పని చేసిన రవీందర్ ధర్మపురి బదిలిపై వెళ్లగా ఆయన స్థానంలో కొనారావు పేట ఎంపిడిఓ శశికళకు ఇంచార్జ్ ఇవ్వగా రెండు రోజులు చేసి వెళ్లిపోయియింది.దీంతో ఎంపిఓ ప్రదీప్ కు ఇంచార్జ్ ఇవ్వగా ఆయన రెండు నెలల సెలవు పై వెళ్లి పోయారు.మళ్ళీ రుద్రాంగి ఎంపీడీఓ నటరాజ కు ఆదనవు బాధ్యతలు ఇచ్చారు.