నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని 18 అమ్మ ఆదర్శ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి జిల్లా, మండల స్థాయి అధికారులు పరిశీలించారు. ఈ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినందున ప్రధానోపాధ్యాయులు ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు సంయుక్తంగా ఖాతా బక్కు తెరవాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. పాఠశాలల్లో ప్రధానంగా విద్యుత్ సౌకర్యం, తాగునీటి సమస్య, మరుగుదొడ్ల నిర్మాణాలు, తదితర సమస్యలను వారు పరిశీలించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్, నీలా, పేపర్ మిల్, కందకుర్తి, బోర్గం, తాడు బిలోలి గ్రామాలలోని పాఠశాలలను సందర్శించి సమస్యలను నివేదికను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఇ రాజయ్య, ఎంపీడీవో హెచ్ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు, పంచాయతీరాజ్ వినయ్ కుమార్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.