అధికారులు వచ్చారు… వెళ్ళారు

నవతెలంగాణ వీర్నపల్లి
దుకాణాలు మూసీ ఉండటంతో ఆహార పదార్థాల అధికారులు వస్తున్నారని స్థానికుల ముందస్తు సమాచారంతోనే షాపు లు మూసీనట్లు చర్చించుకుంటున్న ఘటన గురువారం వీర్నపల్లి మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ విషయం గ్రామంలో చర్చనియాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్ళితే గురువారం పుడ్ ఇన్ స్పెక్టర్ మూడు షాపుల్లో తనిఖీలు చేసినట్లు తెలిసింది. దీంతో బయట ఈ విషయం ఎక్కడ పొక్కలేదు. సంబంధించిన అధికారి తనిఖి చేసి తీసుకున్న శాంపిల్ ను వివరాలను సైతం బయట ఎక్కుడ వివరించలేదు. బయట ఎక్కడ వివరాలు వివరించ కపోవడంతో స్ధానికులు పలు అనుమానాలకు చేస్తున్నారు. షాపులు అసలు ఎందుకు ముసి వేశారనీ షాపులో అన్ని బాగుంటే భయం ఎందుకు ఆ దుకాణదారుల కు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. షాపు ల వారు అందరు కలిసి తలో ఇంత జమ చేసి మాములు ముట్టజెప్పడంతో అధికారులు అలా వచ్చారు. ఇలా వెళ్ళారనీ తూతూ మంత్రంగా తనిఖీలు చేసినట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైన సంబధించిన అధికారులు షాపు ల్లో తనిఖీలు నిర్వహించి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. దీనిపై పుడ్ అధికారులను ఫోన్ లో వివరణ కోరగా స్పందించలేదు.