నేటి ప్రజా పాలన కోసం ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

– తాసిల్దార్ కోడి చింతల రాజు

– ఎంపీడీవో కలకోటి శేషాద్రి
నవతెలంగాణ- నల్లికుదురు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజా పాలన కార్యక్రమాన్ని ఏర్పాట్ల కోసం మండల అధికారులు తాసిల్దార్ కోడి చింతల రాజు ఎంపీడీవో శేషాద్రి తెలిపారు మండలంలోని పెద్ద తండా గ్రామంలో బుధవారం పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలను నెరవేర్చేందుకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు అందులో భాగంగా మండలంలో నేటి నుండి ఈ నెల ఆరవ తేదీ వరకు మండలంలో అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు మండలంలో ఎంపీడీవో ఒకటి టీం ఇందులో ఐదుగురు స్పెషల్ ఆఫీసర్లు కమిటీ సభ్యులు మరియు తాసిల్దార్ ఒకటి లో ఐదుగురు స్పెషల్ ఆఫీసర్లు కమిటీ సభ్యులు కలిసి అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు వీటి ఏర్పాట్లు గ్రామాలలో పూర్తి చేస్తున్నామని ఇందులో భాగంగానే పరిశీలిస్తున్నామని అన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా వారి కావాల్సినటువంటి ఒక దరఖాస్తులు పూరించి ఇవ్వాలని అన్నారు గ్రామంలో నిర్వహించే ఈ పాలనలో 100 కుటుంబాలకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేశామని తెలిపారు.