నవతెలంగాణ – కోహెడ
విద్యుత్ అధికారులు విధుల్లో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారా? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా?.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారడానికి నిదర్శనంగా మండల పరిధిలోని తీగలకుంట పల్లి గ్రామ ప్రధాన రోడ్డుపై ప్రమాదకరంగా మారిన డీటీఆర్ దర్శనమిస్తోంది. గృహా వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న డీటీఆర్ హరితహారంలో నాటిన మొక్కతో ప్రమాదపుటంచునా ఉంది. దీంతో తరుచు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వీడి జేర చెట్టు కొమ్మలను తొలగించాలంటూ స్థానికులు, పలువురు కోరుతున్నారు.