గాంధారి మండలంలోని పెద్ద పోతాంగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని కర్ణంగడ్డ తండాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తండాకు వెళ్లే దారిలో వంతెన 90 శాతం కూలిపోవడం తో తండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని తండా వసూలు కోరుతున్నారు. గత సంవత్సరం కాలంగా వంతెనకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను,
ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోలేదని, ప్రాణాలు పోతే గాని పట్టించు కోరా అని తండా వసూలు ఆరోపిస్తున్నారు.