
రెంజల్ మండలం ధూపల్లి జిల్లా పరిషత్ పాఠశాల, ప్రైమరీ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాటశాల నిధులతో చేపట్టిన పనులను ఎంపీడీవో శ్రీనివాస్, పి ఆర్ ఏఈ వినయ్ కుమార్ లు గురువారం పరిశీలించారు. రూ.6 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు చివరి దశకు రావడంతో మిగిలిన పనులను పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. వారి వెంట పిఆర్టియు మండల అధ్యక్షులు సోమలింగం గౌడ్, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ బాబన్న తదితరులు ఉన్నారు.