బైపాస్ రోడ్ సర్వే ప్రారంభించిన అధికారులు

నవతెలంగాణ – మోర్తాడ్

జాతీయ దారి 63 బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం మోర్తాడ్ మండల కేంద్రంలో చెందిన మున్నూరు కాపు రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన ప్రారంభించినప్పటికీ అధికారులు నేడు సర్వే ప్రారంభించారు. మొదట రైతు సమక్షంలో రెవెన్యూ పోలీసులు సంయుక్తంగా రహదారి నిర్మాణం పై అవగాహన కల్పించాలని సమావేశం ఏర్పాటు చేసి రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాలని అనుకున్నారు కానీ రైతులు దానికి ఒప్పుకోకపోవడంతో 956 జీవో ప్రకారం ప్రభుత్వం ఎప్పుడైనా రైతు భూములను తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆర్డీవో రాజా గౌడ్ రైతులకు వివరించడంతో తమకు ఉన్న కాస్త భూమిని ప్రభుత్వం గుంజుకుంటే తమకు తినడానికి తిండి కూడా దొరకదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుండగా రైతు నాయకుడు న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రైతుల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేయగా పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఆయనతోపాటు తమ నాయకులను అరెస్ట్ చేసి భీంగల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు తమకు రిఫెన్సుగా కొంతకాలతో వినతి పత్రాన్ని అందించాలని ఆ వినతి పత్రాన్ని ఉన్నత అధికారులకు అందిస్తామంటూ అధికారి తెలపడం జరిగిన తాము ఎలాంటి లెటర్ ఇవ్వమని తమ పంట పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతుల మేరకు తాము సర్వే నిర్వహిస్తామని రైతులు వ్యతిరేకిస్తే ప్రభుత్వ చర్యలు తీసుకుంటూ తప్పనిసరిగా సర్వే నిర్వహిస్తామంటూ అధికారులు అనడంతో రైతులు సమావేశం నుండి వెళ్లిపోయారు. రైతులు వెళ్లిపోవడంతో అధికారులు గాండ్లపేట నుండి తిమ్మాపూర్ రహదారి వరకు బైపాస్ రోడ్డుకు అవసరమున్న రహదారి సర్వే నిర్వహిస్తూ హద్దులను ఏర్పాటు చేస్తున్నారు. హద్దులను ఏర్పాటు చేస్తేనే ఏ రైతు భూమి ఎంత పోతుందో తమకు తెలుస్తుంది తప్ప పూర్తిగా రైతు భూములు నష్టపోతున్నాయి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడం సరికాదంటూ రైతులకు సూచించారు. రైతులకు ఇబ్బంది ఉంటే నేషనల్ అథారిటీస్ రహదారుల అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చి అభ్యంతరమైన వ్యక్తం చేయాల్సిందే తప్ప తమ సర్వేలు మాత్రం అడ్డుకోవద్దు అధికారులు రైతులకు వివరించారు.