జనవరి 1 నుంచి ఆన్ లైన్ ద్వారా అధికారులు సెలవు దరఖాస్తులు సమర్పించాలి..

Officials have to submit leave applications online from January 1.– అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్
నవతెలంగాణ – సిరిసిల్ల
జనవరి 1 నుంచి ఆన్ లైన్ ద్వారా అధికారులు సెలవు దరఖాస్తులు సమర్పించాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో e- HRM పోర్టల్ ద్వారా సెలవు మంజూరు దరఖాస్తుల నమోదుపై ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ మాట్లాడుతూ  సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది తమ సెలవు దరఖాస్తులను నూతన సంవత్సరం నుంచి ఆన్ లైన్ పోర్టల్ https://e-hrms.gov.in  ద్వారా మాత్రమే సమర్పించాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు తమ పరిధిలోని ఈ-ఆఫిస్  లాగిన్ ఐడి వినియోగించుకుని ఉద్యోగుల జాబితా, వివరాలను అప్ డేట్ చేయాలని అన్నారు.  ఈ సమావేశంలో  జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.