ఎన్.ఎం.ఈ.ఓ (నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ ) ఆద్వర్యంలో అస్సాం లోని గౌహతి లోని రాడిసన్ బ్లూ లో ఆయిల్ ఫాం పై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సెమినార్ లో స్థానిక ఆయిల్ ఫెడ్ అధికారులు పాల్గొంటున్నారు. సోమవారం సెమినార్ లో కేంద్ర వ్యవసాయ ,రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి అజిత్ కే.సాహు పాల్గొని సుస్థిర ఆయిల్ ఫాం సాగు,విస్తరణ,సంస్థాగతంగ పటిష్ట నిర్మాణం అంశాలు పై ప్రసంగించారు.ఇందులో అస్సాం అగ్రికల్చర్,హార్టికల్చర్ కమీషనర్ లు,ఐఐఓపిఆర్ సంచాలకులు పలు అంశాలు బోధించారు. స్థానిక ఆయిల్ఫెడ్ సీనియర్ అధికారి రాజశేఖర్ రెడ్డి,డీవో ఆకుల బాలక్రిష్ణ లు పాల్గొన్నారు.