
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం మహా జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహించి, మేడారం మహా జాతరను విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ అన్నారు. శుక్రవారం మేడారంలోని ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో సెక్టోరియల్ అధికారులకు, ఇబ్బందికి రెండో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మేడారం మహా జాతర పరిధిలో ఏ ఏ ప్రదేశాలలో విధులు నిర్వహిస్తున్న సిక్టోరల్ ఇంఛార్జి లను వారి సిబ్బందిని అయా ప్రదేశాలు కలుసుకొని వారితో చర్చించారు. అక్కడ వారికి విధించిన బాధ్యతలు అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సెక్టోరల్ ఇన్చార్జిలుగా ఉన్నవారి, పరిస్థితులను తెలుసుకొని తిరిగి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గారితో సమావేశమైనారు. సెక్టోరల్ ఇన్చార్జులు గా నియమించబడిన అధికారులు అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు అక్కడ ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాలను ప్రాజెక్టు అధికారి అంకిత్ కి అన్ని సెక్టోరల్ ఇంఛార్జి లు వివరించారు…. ఈ సందర్భంగా ఐటీడీపీఓ అంకిత్ మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు వారి దగ్గర తీసుకున్న సూచనలను పరిగణం లోకి తీసుకొని ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన బాధ్యతలను నిర్వర్తించాలని అన్నారు. సమ్మక్క సారలమ్మ మహా జాతర కు వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అధికారులకు సూచించారు. జాతర విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, అన్ని వర్గాల వారు సమన్వయంతో మహా జాతరను విజయవంతం చేయాలన్నారు.
జంపన్నవాగు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏ మాత్రం విధులలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని తెలిపారు. జనసముహం లో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం 24 గంటలు చేయాలన్నారు. దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు గల్ఫర్ తో శుభ్రం చేస్తుండాలన్నారు. పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫాం, గ్లౌజ్ లు, మాస్కులు ఇవ్వాలన్నారు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆరోగ్య పరంగా మందులు అందుబాటులో పెట్టుకొని సర్వ సన్నద్దంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆలయ అలంకరణ, లైటింగ్, పరిసరాలు గిరిజన సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం జాతర నిర్వహించాలని అన్నారు.పారిశుద్ధ్య సిబ్బంది సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. శాఖలవారు సెక్టార్లను అంతర్గతంగా విభజించి, సిబ్బందికి షిఫ్టులవారీగా విధులు అప్పజెప్పాలన్నారు.
జరుపుకోవాలనే .గద్దెల వద్ద విధులు నిర్వర్తించే వారు సహనం కోల్పోకుండా భక్తులకు సేవాలందించాలన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలు అందించడం కోసం ద్విచక్ర వాహన 40 అంబులెన్స్లను గిరిజన మ్యూజియం వద్ద జాతరలో సేవలందించడం కోసం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ ) వేణు గోపాల్, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఎస్ఓ రాజ్ కుమార్, డిడి పోచం, సెక్టోరల్ అధికారులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


