నిజాంపూర్, నాలేశ్వర్ రోడ్డును పరిశీలించిన అధికారులు

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని నిజాంపూర్ నుండి నాలేశ్వర్ వరకు వేస్తున్న రోడ్డును ఆర్ అండ్ బిఎస్ సి రాజేశ్వర్ రెడ్డి, ఈ ఈ సురేష్ లు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాలేశ్వర్ శివాజీ విగ్రహం నుండి శివాలయం వరకు రోడ్డున పరిశీలించి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరిన్ సాయిబాబా ఆలయం నుండి శివాజీ విగ్రహం వరకు సుమారు 150 మీటర్ల వరకు ఫోర్ లైన్ రోడ్డు వేయాలని కోరగా ఎస్సీ రాజేశ్వర్ రెడ్డి ఎస్టిమేషన్ వేయాలని డి ఈ కి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఈ మోహన్, ఏఈ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.