
రాష్ట్ర ప్రభుత్వం మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు జయంతి వేడుకలను అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ముత్తారం మండల కేంద్రంలోని కేశనపల్లి గ్రామంలో గల శ్రీపాద రావు విగ్రహం వద్ద జయంతి వేడుకల ఏర్పాట్లను జిల్లా పంచాయతీ అధికారి ఆశ లత అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. జయంతి వేడుకలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఎంపిడిఓ లలిత, ఎంపిఓ బైరి వేణు మాదవ్ గ్రామస్తులున్నారు.