వివాదాస్పద భూమిని పరిశీలించిన అధికారులు

Officials inspected the disputed landనవతెలంగాణ – ఆర్మూర్
మండలం లోని చేపూర్ గ్రామ శివారులో ఉన్న గ్రామస్తులు జంబి పూజకు  గ్రామ దేవతలకు సబ్ స్టేషన్ వ్యవసాయ తోటలకు వెళ్లే దారిని దౌర్జన్యంగా సారంగి విజయ్ మూసివేసిన  రోడ్డును శుక్రవారం  తహసిల్దార్ గజానన్ ,  స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవి కుమార్ సందర్శించి గ్రామస్తుల ధ్వారా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న సీనియర్ పెద్దమనుషులు  మాట్లాడుతూ.ఊరు పుట్టక ముందు నుండి ఈ రోడ్డు ఉంది అని దౌర్జన్యంగా సారంగి విజయ్ ఇట్టి భూమి నాది అని దౌర్జన్యం చేయడం. గ్రామంలో ఉన్న అన్ని రోడ్లు కూడా పట్ట భూములను నుండే ఉంటాయని అదేవిధంగా గతంలో 2017 సంవత్సరములు జెడ్పిటిసి సాందన్న కూడా ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి ఇదే రోడ్డు వేశాడని, 2010 సంవత్సరంలో ఎంపీటీసీగా ఉన్న జన్నపల్లి గంగాధర్ కూడా మెటల్ రోడ్డు వేశాడని  గ్రామంలో ఉన్న ప్రజలు, వృద్ధులు, తహసిల్దార్ కు సిఐ లకు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎస్ కె చిన్నారెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మేడిపల్లి శ్రీకాంత్, కోశాధికారి రుక్మాజీ. మాజీ ఎంపిటిసి, జన్నపల్లి గంగాధర్, మాజీ సర్పంచ్ ఇందూర్ సాయన్న , గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, సొసైటీ మాజీ డైరెక్టర్ సారంగి శాంతి కుమార్, దాసరి నాగరాజు, యూవ న్యాయవాది సింధూకర్ చరణ్, కంపదండి వినోద్, గొల్ల చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.