
పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను మండల తహసీల్దార్ గజానన్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎంఈఓ రాజ గంగారం లు బుధవారం తనిఖీ చేశారు. గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా అధికారులు విచారణకు వచ్చి విద్యార్థులతో, విద్యార్థుల తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.