
జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలను అధికారులు రెండవ రోజు గ్రామ సభలు గ్రామాలలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అయినా ఎంపీడీవో తాహసిల్దార్, ఎంపీఓ, గ్రామసభలలో పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. జుక్కల్ మండలంలోని నాగర్ గావ్, పెద్ద ఏడిగి, పడంపల్లి, గ్రామాలలో బుధవారం ఉదయం గ్రామసభలు ప్రారంభించబడినవి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఈ నాలుగు స్కీములకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను గ్రామసభలు చదివి వినిపించడం జరిగింది. అదేవిధంగా చదివి వినిపించిన వాటిని ఆమోదించడం జరిగింది. లబ్ధిదారుల పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిందిగా గ్రామసభలో సూచించడం జరిగింది. నాగల్ గావ్, పడంపల్లి గ్రామసభలలో ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొనగా పెద్ద ఏడిగి గ్రామ సభలో మండల స్థాయి అధికారులు వివిధ గ్రామాల జిపి సెక్రెటరీలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.