– ఇల్లంతకుంట మండలంలో పట్టుబడిన మండల యువకుడు
– అరికట్టడంలో అధికారులు విఫలమని విమర్శలు
నవతెలంగాణ – బెజ్జంకి
అధికారుల అలసత్వం వల్ల మండలంలో గంజాయి ఆనవాళ్లు అయా గ్రామాలకు వేర్లుగా విస్తురిస్తున్నాయి. దీంతో యువత జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా మండలంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నా.. సంబంధిత అధికారులు గంజాయి విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యూరనే వాదనలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనం మండలంలోని గుండారం గ్రామానికి చెందిన యువకుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గంజాయి రవాణ చేస్తూ 23న రాత్రి సమయంలో పట్టుబడడం కలకలంరేపింది. గంజాయి వల్ల యువత జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని..ఇట్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి గంజాయిని నివారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.