
– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో జిల్లా, మండల స్థాయి అధికారులు ఆయా చోట పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ఆదనవు కలెక్టర్ ఏ. వెంకటరెడ్డి తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా,మండల స్థాయి అధికారులు ఆయా చోట తప్పక పాల్గొనాలని సూచించారు. వర్ష భావ పరిస్థితులు వలన వచ్చే వేసవి దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఎక్కడ కూడా త్రాగునీరు సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విద్యుత్ దుబారా కాకుండా అలాగే జిపిలలో స్ట్రీట్ లైట్స్ టైమింగ్ ప్రకారం వాడకం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలకు అందిన 319 దరఖాస్తులలో 215 పరిష్కరించడం జరిగిందని అలాగే 104 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది డేటా ఎంట్రీ త్వరితిగతిన పూర్తి చేయాలని ఇంకా అందించని అధికారులు సత్వరమే అందించాలని సూచించారు. అదేవిదంగా అన్ని శాఖల నుండి ఈ.. ఆఫీస్ ద్వారా ఫైల్స్ రావాలని , బదిలీలపై వచ్చిన అధికారులు అవగాహన పొందాలని అన్నారు.ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించిన అర్జీలు 24 అలాగే ఇతర శాఖలకు సంబంధించి 37 మొత్తం 51 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా, మండల అభివృద్ధి ప్రణాళికలు ప్రతిపాదనలు ద్వారా పనులు చేపట్టాలని, వేసవి దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళికతో నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. మండల స్థాయిలో విశ్వకర్మ దరఖాస్తులను త్వరిత గతిన పరిశీలన చేయాలని సూచించారు.ఈ సమావేశంలో సి.ఈ. ఓ అప్పారావు, పి.డి. మధుసూదన్ రాజు , డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, డి.ఎస్.ఓ మోహన్ బాబు, డిటీడీఓ శంకర్, డీఎంహెచ్ వొ డా.కోటచలం , ఎఫ్.డి.ఓ రూపేందర్ సింగ్, ఏ. ఓ సుదర్శన్ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.