
నవతెలంగాణ – మద్నూర్
యాసంగిలో సాగుచేసిన వరి పంటలను మంగళవారం నాడు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి భాగ్యలక్ష్మి మండల వ్యవసాయ అధికారి రాజు ఏఈఓ సమ్రిన్ డోంగ్లి మండలంలోని మదన్ ఇప్పర్గా గ్రామ శివారు ప్రాంతంలో సాగుచేసిన వరి పంటను పరిశీలించారు వరి పంటపై కాండంతోల్చే , రెక్కల పురుగులు గమనించినట్లు వాటి నివారణ కోసం జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి భాగ్యలక్ష్మి సాగు రైతులకు సలహాలు సూచనలు అందించారు,నివారణకు ముందుగా నారుమడిలో కార్బోఫ్యురాన్ 3 గ్రాముల గుళికలు లేదా పిప్రోనిల్ 0.3 గుళికలు 600గ్రాము వేసుకోవాలి. నారుమడిలో వెయకుంటే 15రోజుల తరువాత లేదా పిలక దశలో కార్బోఫ్యురాన్ 3 గ్రాముల 10కిలోలు లేదా కార్టాఫైడ్రో క్లోరైడ్ 4 గ్రాముల 8 కిలోలు ఎకరాకి ఇసుకలో కలిపి చల్లుకోవాలి సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఏఈఓ సమ్రీన్ ,ఎంపీటీసీ సుభాష్, రైతులు పాల్గొన్నారు.