మంత్రి పి కలిసిన వ్యవసాయ శాఖ అధికారులు..

నవతెలంగాణ-డిచ్ పల్లి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా పర్యటన కు వచ్చిన సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, నిజామాబాద్ డివిజన్ ఏడిఏ ప్రదీప్ కుమార్, నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గం లోని అన్ని మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు కలిసి జిల్లాలో, డివిజన్లో వ్యవసాయానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మంత్రికి శాలువా, పుష్ప గుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రాంబాబు, ప్రవీణ్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.