నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామ శివారులో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, వ్యవసాయ విస్తీనాధికారి ప్రసాదులు శనివారం పరిశీలించారు. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో పైపై వాటిని తొలగించి వేరే పట్టాలో వాటిని ఆరబెట్టాలని రైతులకు సూచనలు ఇచ్చారు.