ఫ్రీ క్యాస్ట్ ను తొలగించిన అధికారులు

నవతెలంగాణ – ఆర్మూర్ 
 మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో గల 44వ జాతీయ రహదారి పక్కన జాతీయ రహదారుల శాఖకు చెందిన స్థలంలోనీ ఫ్రీకాస్ట్ ను 44వ జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గురువారం అధికారులు తొలగించారు. మామిడిపల్లిలోని విజయలక్ష్మి గార్డెన్ ఎదురుగా నున్న స్థలాన్ని 2006లో జాతీయ రహదారుల విస్తీర్ణంలో భాగంగా భూమిని సేకరించి స్థల యజమానికి డబ్బులు చెల్లించారు. మామిడిపల్లి నుంచి జాతీయ రహదారికి వెళ్లే రోడ్డు కాబట్టి రహదారుల శాఖ అధికారులు కొంత స్థలాన్ని భవిష్యత్తులో ఉపయోగ పడుతుందనే ఉద్దేశంతో ఉంచడం జరిగింది. ఈ స్థలాన్ని రహదారి విస్తీర్ణలో కేంద్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు తీసుకున్న స్థల యజమాని భూమి కబ్జా చేసి చుట్టూ ప్రికాస్ట్ నిర్మించారు. అంతేకాకుండా మధ్యలో అనుమతి లేకుండా బోర్ ను వేశారు. రహదారుల శాఖకు చెందిన స్థలాన్ని ఫ్రీకాస్ట్ ఏర్పాటు చేసి కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అయినా ఫ్రీ కాస్టును తొలగించకపోవడంతో 44వ జాతీయ రహదారుల శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పిఏ పవన్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. రెవెన్యూ, పోలీసుల సహకారంతో సర్వే చేసి హద్దులు పాతారు. అనంతరం అక్రమంగా భూమి కబ్జా చేసి ఏర్పాటు చేసుకున్న ఫ్రీ కాస్ట్ ను జెసిబి తో తొలగించారు. కామారెడ్డి నుంచి ఆదిలాబాద్ వరకు 44వ జాతీయ రహదారికి ఇరువైపులా తమ శాఖకు చెందిన స్థలాలు ఉన్నాయని పిఏ పవన్ వివరించారు. ఈ స్థలాలను ఎవరైనా కబ్జా చేస్తే గుర్తించి తొలగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల సైట్ ఇంజనీర్ రవిశంకర్, కన్సల్టెంట్ రామారావు, ఇందల్వాయి టోల్ గేట్ మేనేజర్ వీరాజ్ దేశ్ పాండే, రూట్ ఆపరేషన్ ఇన్చార్జి వీరబాబు, మండల సర్వేయర్ షికారి రాజు, మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ అశోక్ సింగ్, ఏఎస్ఐ లక్ష్మణ్, జాతీయ రహదారుల సిబ్బంది పాల్గొన్నారు.