
– ఈపాస్ ద్వారానే అమ్మకాలు జరగాలి: జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి
నవతెలంగాణ – మద్నూర్
మండల వ్యవసాయ అధికారి గ్రామాల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మండల రైతులకు ఎల్లవేళల అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పంటలు పరిశీలిస్తూ రైతులకు సలహాలు సూచనలు అందించాలని పార్టీలైజర్ షాపుల్లో దుకాణదారులు ఈపాస్ ద్వారానే అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి భాగ్య లక్ష్మి ఆదేశాలు ఇచ్చారు మద్నూర్ మండలంలోని మెనూర్, పెద్ద ఎక్లార, మద్నూర్ గ్రామాల్లో ఎరువువుల దుకాణాలను పరిశీలించి, రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచి, ఈపాస్ ద్వారానే అమ్మలని సూచించడం జరిగింది. అలాగే మద్నూర్ రైతు వేదిక యందు స్థానిక వ్యవసాయ అధికారి మరియు ఆయా క్లస్టర్ల ఏ ఈ ఓ లతో సమావేశం ఏర్పాటు చేసి వానాకాలంలో సాగు చేస్తున్న పంటలను ముఖ్యంగా వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటలను పరిశీలించి సలహాలు ,సూచనలు చేయాలని సూచించారు. సాగు చేస్తున్న పంటలను ఎప్పటికప్పుడు సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు, ఏ ఈ ఓ లు ప్రియాంక, బాజన్న,లక్ష్మణ్, సతీష్, నందేవ్ , అనిల్, గజనన్, సంరిన్, సంయుక్త పాల్గొన్నారు.