అధికారులు ఇందిరమ్మ కమిటీలకు ప్రాదాన్యత కల్పించాలి..

Officials should give priority to Indiramma Committees..– కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంచంద్రయ్య..
నవతెలంగాణ – నవాబ్ పేట
రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పథకాల అమలు కొరకై గ్రామాలలో సర్వే కి వెళ్లే అధికారులు తప్పనిసరిగా మీ వెంట ఇందిరమ్మ కమిటీ సభ్యులను తీసుకొని వెళ్లాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాంచంద్రయ్య సూచించారు.గ్రామాలలో పథకాలను అమలు చేసేందుకు నిర్వహించే సర్వేలో కొందరు స్పెషల్ ఆఫీసర్లు ఇందిరమ్మ కమిటీ సభ్యులను వెంటపెట్టుకొని వెళ్లకుండా తామే వెళ్లి ఇండ్లు,పథకాలు మంజూరు చేస్తామని,దానికి సంబంధించిన అధికారం అంతా తమకే ఉందని అంటున్నారని శాసన సభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి దృష్టికి వచ్చిందని ఇది ప్రభుత్వ విధానానికి పూర్తిగా వ్యతిరేకం ఈ విధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు లేకుండా అధికారులు ఒక్కరే వెళ్లి సర్వే చేస్తే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.అధికారులు సర్వే కార్యక్రమానికి ఇందిరమ్మ కమిటీ సభ్యులను తప్పనిసరిగా వెంటపెట్టుకుని వెళ్లాలని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని గమనించి ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీ సభ్యులను అధికారులు నిర్లక్ష్యం చేస్తే వెంటనే ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని కోరారు.