ప్రజాభివృద్ధిలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు

– మండల సర్వసభ సమావేశం వాయిదా: ఎంపీపీ అనురాధ రమేష్‌
నవతెలంగాణ-పెద్దేముల్‌
గ్రామ అభివృద్ధికి ప్రతి అధికారి తన వంతు సహకారం అందించాలని, ప్రజాభివృద్ధిలో అధికారులు నిర్లక్ష్యం చేయరాదని పెద్దేముల్‌ ఎంపీపీ అనురాధ రమేష్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వసభ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనురాధ రమేష్‌ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ సమావేశానికి వివిధ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సర్వసభ సమావేశానికి సమావేశం కొనసాగించేందుకు ఫోరం లేకపోవడంతో సభను వాయిదా వేసినట్టు ప్రకటించారు. వచ్చేనెల 2న, మంగళవారం ఉదయం 11 గంటలకు సర్వ సభ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ధారాసింగ్‌, వైస్‌ ఎంపీపీ మధులత శ్రీనివాస్‌ చారి, ఎంపీడీవో జర్నప్ప, తహసీల్దార్‌ కిషన్‌, విద్యాధికారి వెంకటయ్య గౌడ్‌, సీడీపీఓ లక్ష్మి, ఎంపీటీసీలు శంకర్‌ నాయక్‌, ధన్‌ సింగ్‌, శ్రీనివాస్‌, కో ఆప్షన్‌ సభ్యులు నసిర్‌, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల ప్రత్యేక అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.