అధికారులు వ్యవసాయదారులకు సలహాలు సూచనలు అందించాలి

– పంటలు పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి

నవతెలంగాణ మద్నూర్: జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి భాగ్య లక్ష్మి గురువారం నాడు మద్నూర్ మండలంలోని అవల్గావ్, మద్నూర్ ,గ్రామాల్లో వానాకాలంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ అధికారులు ,విస్తరణ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటలను పరిశీలించి సలహాలు ,సూచనలు చేయాలని సూచించారు. అలాగే సాగు చేస్తున్న పంటలను ఎప్పటికప్పుడు సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఏ డి ఏ, లక్మి ప్రసన్న , మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు , ఏ ఈ ఓ లు ప్రియాంక, బాజన్న, అవల్గం మద్నూర్ గ్రామాల వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.