నవతెలంగాణ – ఆర్మూర్: అధిక ఫీజులు అరికట్టాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షులు అఖిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ కార్పొరేటర్ యాజమాన్యాలు తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తున్నాయి ఇష్టానుసారం అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేకాకుండా కమిషన్లకు కక్కుర్తి పడి పాఠ్య పుస్తకాలు నోట్ బుక్కులు సైతం విగ్రహిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలలు తనిఖీ చేసే చర్యలు తీసుకోవాలి లేకుంటే ఆందోళనలు చేపడుతం అని హెచ్చరించారు.