నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని ఉన్నత అధికారుల ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కరించాలని ఎంపీపీ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు గురువారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల ఉద్దేశించి మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభం అయినందున అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక విద్యుత్ శాఖ అధికారుల తీరు వల్ల ఇబ్బందులు ఎదురు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శులతోపాటు సభ్యుల సభ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీపీ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో పంచాయితీల వద్ద అమరవీరుల నివాళులు అర్పించే కార్యక్రమం ఉన్నందున సర్పంచుల్లో మెజారిటీ శాతం హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, ఎంపీఓసురేకాంత్, వైస్ఎంపీపీ లక్ష్మి, మిషన్ భగీరథ డిఈ.కౌశిక్, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.