హెచ్‌ఎండీఏ భూములలో సర్వే ప్రారంభించిన అధికారులు

నవతెలంగాణ-మియాపూర్‌
హెచ్‌ఎండీఏ భూముల్లో సర్వేను ప్రారంభిం చిన రెవెన్యూ హెచ్‌ఎండిఏ అధికారులు 5 రోజుల నుండి వివిధ ప్రాంతాల నుండి ఇండ్ల స్థాలాల కో సం మియాపూర్‌ 100,101కు వేలాది మంది జనం తరలి రావడంతో వారిని పంపించే క్రమంలో మియాపూర్‌ ప్రాంతం అంతా రణరంగంగా మా రింది. ప్రస్తుతం 144 సెక్షన్‌ విధించడంతో మి యాపూర్‌ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెల కొంది. చుట్టూ సమీప ప్రాంతం పోలీసులు పహా రాలో కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో పోలీసులు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. 100,101 సర్వే నంబర్‌లోని భూములను ఆక్రమణ గురికా కుండా అధికారులు కట్టు దిట్టమైన చర్యలు ప్రారం భించారు. అక్రమించేందులు వచ్చిన జనాలను పో లీసుల సహకారంతో అక్కడినుండి తరిమేసి భూ మిలోకి మరల ఎవరు లోపలికి వెళ్లి కబ్జాకు పాల్పడ కుండా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు 6 జేసీ బీలతో 100,101 భూమి చుట్టూ భారీ గుంతలను తవ్వకాలు చేస్తున్నారు. తవ్విన భూముల చుట్టు కంచెన ఏర్పాటు చేయడం కోసం అధికారులు ము మ్మర ఏర్పాట్లు ప్రారంభించారు. అందులో భాగం గానే సర్వేను వేగవంత చేశారు. 100,101 సర్వే నంబర్‌లో సుమారు 520 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు తమవి అంటూ 30 ఏండ్ల కిందట కొంత మంది ప్రయివేటు సంస్థలు కోర్టుకి వెళ్లారు. ఈ భూమిపై కూడా హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. మరల ప్రయివేటు సం స్థలు సుప్రీమ్‌ కోర్టును ఆశ్రయించారు. ఈ భూము లను హెచ్‌ఎండీఏ పరిరక్షణ చేస్తుంది. నగరంలో భూములను అధిక ధర పలుకు తుండడంతో అందరి కన్ను ఈ భూములపై పడింది. ఇందులో భాగంగానే ఈ భూమిలో కబ్జాలకు తెర లేపుతు న్నారు. భూమిలో సుమారు 60 ఎకరాల కబ్జాకు గురైంది. ఎంఎ నగర్‌, స్టాలిన్‌ నగర్‌, దీప్తి శ్రీనగర్‌ కాలనీలో ప్రశాంతనగర్‌కాలనీ సమీపంలో కబ్జాలు చేసి నిర్మాణాలు చేశారు. దీప్తి శ్రీనగర్‌ కాలనీ సర్వే నంబర్‌లోని ప్లాట్లకు బై నంబర్‌ వేసి 10 వేల సం ఖ్యలో ప్లాట్లు వెలిశాయి వాటికి అడ్డదారిలో అనుమ తులు తీసుకొని నిర్మాణాలు చేశారు. సుప్రి కోర్టులో కేసు విచారణలో ఉండగా స్టేటస్‌ కో నిబంధనలు ఉన్న అవేమీ లెక్క చేయకుండా కబ్జాలకు పాల్పడ్డా రు. వీటిపై ఎప్పుడైనా అధికారులు దష్టి సాధించి కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసం ఘాలు ప్రజలకు కోరుతున్నారు. ఆదివారం జరి గిన100,101 సర్వే నంబర్‌లలో ఆక్రమణకు ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి 21 మందిని రిమాండ్‌కు తరలించగా సోమవారం మరో 10 మందిని గుర్తించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు.