
అమ్మ ఆదర్శ పాఠశాలలు ఎంపికైన పాఠశాలలను ఎంఈఓ స్వామి, పంచాయతీ రాజ్ డిఈ రాజేశ్వర్, ఏఈ మేఘన శనివారం పరిశీలించారు. మండలంలో బెజ్జోర గ్రామంలోని జడ్పీహెచ్ఎస్, ముచ్కూర్, లింగాపూర్ గ్రామాలలోని ప్రాథమికోన్నత పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపికవ్వగా శనివారం ఆ పాఠశాలలో మౌలిక వసతులు మరుగుదొడ్లు, మూత్రశాలలు, త్రాగునీరు లను పరిశీలించి నివేదికను తయారు చేశారు. వీరి వెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.