– రోడ్డుకు ఇరువైపుల పెరిగిన కంప, తుమ్మ చెట్లు తొలగింపు
– వీటని తొలగించాలని గతంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసిన చీర శేఖర్
నవతెలంగాణ-యాచారం
యాచారం మండల పరిధిలోని మల్కీ జ్ గూడ నుంచి గాండ్లగూడ వరకు రోడ్డుకు ఇరువైపుల ఏపుగా పెరిగిన కంప తుమ్మ చెట్లను తొలగించాలని రెండు రోజుల కిందట కాంగ్రెస్ నాయకుడు చీర శేఖర్ ఎంపీడీవో నరేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. మంగళవారం ఎట్టకేలకు అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంప తుమ్మ చెట్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు ఇరువైపులా ఉన్న కంప చెట్లను జెసిపితో అధికారులు తొలగిస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకుడు అధికారులకు కతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఏపుగా పెరిగిన చెట్లతో వచ్చిపోయే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ విషయంపై అధికారులు స్పందించడం హర్షించదగ్గ విషయమని చెప్పారు.