నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 28 2023 నుంచి వ తేదీ నుంచి జనవరి 6వ 2024 వరకు తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించింది . తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు గ్యారెంటీ పథకాలకు ప్రజాపాలన దరఖాస్తు కీలకంగా కానుంది. కానీ అధికారులు మాత్రం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారునికి సంబంధించి ఆన్లైన్లో అప్డేట్ చేయకపోవడంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. వివరాలను పరిశీలిస్తే భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామానికి చెందిన బండి పద్మ దరఖాస్తు సంఖ్య a/01 గా జనవరి 5, 2024వ రోజున ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, ఇందిరమ్మ ఇండ్లు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ , కంప్యూటర్లో అప్లోడ్ కాలేదని అధికారులు చెబుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి కంప్యూటర్లో అప్లోడ్ కాలేదని చెబుతున్నారని, ఏం చేయాలో తెలియడం లేదన్నారు. ఇలాంటి విషయాలను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇంట్లో పై భువనగిరి ఎమ్మెల్యే దృష్టి కేంద్రీకరించి ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని , పేద ప్రజలకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బొమ్మలరామారం మండల కేంద్రంలోని నాలుగో వార్డుకు చెందిన ఏశబోయిన నవనీత డిసెంబర్ 30 వ తేదీన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మి పథకానికి, ఇందిరమ్మ ఇండ్ల కోసం, గృహ జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించిన ప్రజా పాలన దరఖాస్తు కంప్యూటర్ల అప్లోడ్ చేయలేదని సంబంధిత అధికారులు తెలపడంతో వారు చేసేదేమీ లేక లబోదిబోమంటున్నారు. గృహ జ్యోతి పథకం రాకపోవడం, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని అడిగినప్పటికీ స్పందించకపోవడంతో ఎంపీడీవోను అడగడంతో ఎంపీడీవో కంప్యూటర్లో అప్లోడ్ చేయలేదని చెప్పారని బాధితురాలు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాపాలన దరఖాస్తు కంప్యూటర్ లో అప్లోడ్ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.
ప్రజాపాలనలో దరఖాస్తులు నమోదు కాని వారి పరిస్థితి ఏమిటి….?
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారుల తప్పిదం కారణంగా కంప్యూటర్లు అప్లోడ్ చేయకపోవడంతో లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు అనర్హులుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కాగా ఈ పరిస్థితిని సరిదిద్దడానికి మళ్లీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని కంప్యూటర్లో రీ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటే బాగుండేది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేలు , జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ వివరణ కోరగా స్పందించలేదు.