
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి కలర్లు వేసి నెలలు గడుస్తున్నప్పటికీ, కార్యాలయానికి పేరు రాయించడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబించడం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇదేనా, కాదా, బిల్డింగు మారిందా, అనే విధంగా ప్రజలు ఆచర్యపోతున్నారు. కార్యాలయానికి పేరు ఉండాలి కానీ, నెలలు గడిచినా కార్యాలయం పేరు బోర్డుపై రాయించకపోవడం పై అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి కలర్లు వేసి నెలలు గడుస్తున్న కార్యాలయం పేరు రాయించకపోవడం ఇప్పటికైనా అధికారులు స్పందించి , మండల ప్రజా పరిషత్ కార్యాలయం పేరు వెంటనే రాయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.