– మీ హయాంలో అభివృద్ది శూన్యం..
– వాడివేడిగా సర్వ సభ్య సమావేశం
– పెండింగ్ బిల్లులు ఇప్పించండి, రుణపడి ఉంటాం
– అధికారులపై మండిపడిన సర్పంచ్ లు
నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళ వారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మాలోతు భూలా అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచ్ దినకర్ 2018 పంచాయతి రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ ను పట్టు పట్టి అభివృద్ది పనులును చేయించారు పనులు చేయకపోతే పనులు జాప్యం చేస్తే కలెక్టరు లు షోకాజ్ నోటీసులు ఇచ్చారు బిల్లు రాకున్న అప్పో సప్పో తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే అయిదు సంవత్సరాలు పూర్తి అయినా బిల్లు రాలేదు ఇదే మాకు చివరి సమావేశం ఇప్పటికైన చేసిన అభివృద్ది పనులలో ఎంబి రికార్డ్ చేసి ఈ రెండు రోజుల్లో అయినా మా పెడింగ్ బిల్లు చెల్లిస్తే మికు రుణపడి ఉంటామని అవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ లకు బిల్లు రాకుండా ఇబ్బందుల పెట్టిన అధికారులకు త్వరలోనే సరైన ఫలితాలు దక్కుతాయన్నారు. ఎంపీటీసీ అరుణ్ కుమార్ ఎసంగి పంట కాలంలో ధాన్యం కొనుగోలు లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళిక చేసి ఏసంగి లో లారిల కొరత, గన్ని సంచుల కొరత లేకుండ రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ఎర్రగడ్డ తండ సర్పంచ్ జగ్మల్, శాంతి నగర్ సర్పంచ్ మల్లేశం పెండింగ్ బిల్లులు లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే ఇంటిటికి వెళ్లి కరెంట్ బిల్లు కట్టిన కరెంట్ వైర్లను తొలగించడం పై మండి పడ్డారు తొలగించిన క్రమంలో ట్రాన్స్ ఫారమర్ పై ఉన్న లాక్ వేయకుండడం తో ఓవర్ లోడ్ తో వైర్లు తెగిపోయయని గ్రామ హెల్పర్ లకు ఫోన్ చేసిన స్పందించలేదు వైర్లు తెగి చావమంటరా ? అని సర్పంచ్ జగ్మల్ సెస్ ఎ ఈ పై మండిపడ్డరు . ఇలాంటి సంఘటనలో గతంలో ఇద్దరు మరణించారు. అయినా మీ అధికారులు పట్టించు కోవడం లేదు మేము చెప్పిన పట్టించు కొరు మీకు పెండింగ్ బిల్లులు కావాలి కాని ప్రజల సమస్యలు మాత్రం పట్టవన్నారు . గత ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛ మైన త్రాగు నీరు అందించాలని ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథగా కార్యక్రమం చేపట్టిన మిషన్ భగీరథ నీళ్లు మాత్రం అయిదు ఎండ్లలో ఒక్కసారి కూడ 30 శాతం కుడా త్రాగు నీరు అందించ దాఖలాలులేవు వచ్చిన నీటిని బోల్లు బోకెలు బట్టలకు మాత్రమె వాడారు . మిషన్ భగీరథ నీళ్లు రాక బొరు మోటార్ లకు రిపేర్ కు ఎక్కువ ఖర్చు అయిందన్నారు. మీషన్ భగిరథ త్రాగాలి అని చెప్పిన అధికారులు మాత్రం టాటా వాటర్ త్రాగడం గమనార్హం అని అన్నారు. చేసిన మిషన్ భగీరథ పనులకు బిల్లు లు ఇప్పించాలని సర్పంచ్ లు అధికారులను కోరారు.గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బందు కొత్తగ వచ్చిన ప్రభుత్వం రైతులకు రైతు బందు, రైతు బీమా అలాగే కొనసాగిస్తారా ? రైతు బందు ఎందుకు పడటం లేదని రైతులు అడుగుతున్నారని అధికారులను ప్రశ్నించారు. గత ఏడాది వడ గండ్ల వానకు రైతులు పండించిన పంట నెల పాలైన పంట ను మాజి మంత్రి కేటీఆర్ పరిశీలించి రైతులను ఆదుకుంటాం అండగా ఉంటామని చెప్పి ఎకరం కు 10 వేలు ఇస్తామన్న హామీ నెరవేరుతుందా ? పంట భీమా అయినా వర్తింప చేయాలని అధికారులను కోరారు. అప్పుడే ట్రేసరులో ఏకరనికి పంట భీమా ద్వార పది వేలు జమ చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం గైడ్ లైన్స్ రాలేదనీ ఎ ఓ తెలిపారు. సర్పంచ్ వీర్నపల్లి పై అధికారులు ప్రజా ప్రతినిధులు కక్ష కట్టినట్లు అభివృద్ది చేయలేదు స్మశాన వాటికకు కరెంట్, సీసీ రోడ్డు, బోరు బావి ఎలాంటి సౌకర్యం కొరకు ఎన్ని సార్లు విన్నవించిన చుట్టు ప్రక్కల గ్రామాల కు స్మశాన వాటికకు అన్ని వసతులు కల్పించి వీర్నపల్లి మండల కేంద్రాన్ని మరిచారు. వీర్నపల్లి కేంద్రంలో డబుల్ రోడ్డు కొసం మూడు సార్లు గ్రామ పంచాయతి మార్కింగ్ ఇచ్చిన రోడ్డు పనులు చేయలేదు. రోడ్డుపై గుంతలు ఏర్పడిన ప్రతి సారి మట్టి పోయడని కే దాదాపు లక్షలు ఖర్చు అయ్యాయని, ప్రక్క మండలంలో రోడ్డు అయ్యింది. మన దగ్గర ఎందుకు కాలేదు వీర్నపల్లి మండల కేంద్రం మండల ఆఫీస్ లకు భుములు అంటే ఇవ్వాలి పనులు మాత్రం మేము అడిగినవిచెయ్యరు మీ హయాంలో ఇప్పటివరకు ఒక్క పని కుడా కాలేదు అభివృద్ది శూన్యం మని మట్టి రోడ్డు వలన దుమ్ము తో అనారోగ్యాలకు గురువు తున్నమని ప్రజా ప్రతినిధులపై అధికారుల పై త్రివంగా ద్వజమెత్తారు. మండల ఆయి ఎండ్లు గడిచిన ఒక్క అంబులెన్స్ సేవలు తప్ప ఆరోగ్య కేంద్రం లేదు, ఉన్న సబ్ సెంటర్ లో మెడికల్ అపిసర్ కూడ లేడనీ పేరు కు మండలం తప్ప అయిదు ఎండ్ల లలో చేసింది ఏం లేదు ఒరగ పెట్టింది ఏం లేదు సర్పంచ్ అవేధన వ్యక్తం చేశారు. మీకు ఉన్న కొద్ది కాలంలోనైన రోడ్డు పనులు పూర్తి చేసి మండల అభివృద్ధి లో కృషి చేయాలని ప్రజా ప్రతినిధులను కొరారు. వాడి వేడి గా కోసాగిన సర్వ సభ్య సమావేశం ఉపాధి హామీ, విధ్య, ఆరోగ్య శాఖ, అంగన్ వాడి పై చర్చించకుండానే సమావేశం ముగించారు. ఈ సమావేశానికి కొన్ని శాఖలు అధికారులు గైర్హాజర్ అయిన అధికారుల పై చర్యలు తీసుకుంటామని ఎంపిపి తెలిపారు. ప్రతి సమస్యను పరిష్కరించి మండలంలో ఉన్న పెండింగ్ బిల్లులు,అభివృద్ది పనులను పూర్తి చేసి మండల అభివృద్ధి కీ చేస్తామని ఎంపిపి భులా, జెడ్పీటిసి కళావతి తెలిపారు.అనంతరం సర్పంచ్ లకు శాలువ కప్పి ఆత్మీయ సత్కారించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇసంపల్లి హేమ, ఎ ఎం సి చైర్మన్ రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ మల్లేశం, జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు సాగర్, తహశీల్దార్ ఉమా రాణి, ఎంపీడీఓ నరేష్, ఎ ఓ భూమ్ రెడ్డి, ఎ పి ఎం నర్సయ్య, ఎ ఈ అనిల్, ఎ ఈ వెంకన్న, ఎం ఈ ఓ రఘుపతి సర్పంచ్ లు ఎంపీటీసీలు, అధికారులు, ఉన్నారు.